V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతన్నలు…..

SHARE:

– బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకున్న బాధితులు

– భూములను వేలం వేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్న బ్యాంకు అధికారులు

– ఆనాడు ఇంటి తలుపులు తీసుకెళ్తేనే మండిపడిన రేవంత్ రెడ్డి

– శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మర్చిన ముఖ్యమంత్రి

– నేడు భూములు వేలం వేస్తున్న స్పందించకపోవడంపై బాధిత రైతుల ఆవేదన

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలో గల మిర్జాపూర్,మైలారం, దుర్కి, నసురుల్లాబాద్, నాచుపల్లి గ్రామాల పరిధిలో గల వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) లలొ తమ వ్యవసాయ భూముల అభివృద్ధి కొరకు భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు.రుణాలు చెల్లించక పోతే తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని రైతులను అధికారులు హెచ్చరించారు. అంకోల్ తాండ కు చెందిన అనూష బాయి తన వ్యవసాయ భూమి అభివృద్ధి కొరకు 2013-14 లో నసురుల్లాబాద్ సొసైటీలో రూ .3 లక్షల 70 వేల రూపాయలు అప్పు తీసుకోగా.. అవి కాస్త ఇప్పుడు రూ 10 లక్షల 29 వేలు అయిందని తెలిపారు. పలుమార్లు అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆమె అప్పు చెల్లించకపోవడంతో మూడు రోజుల క్రితం వేలం వేయడానికి బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో సదరు రైతు బోరున విలపిస్తూ బ్యాంకు అధికారులకు రూ.2 లక్షలు చెల్లించి గడువు కోరగా వేలంపాటను 15 రోజులపాటు వాయిదా వేశారు. రావుల శ్రీనివాస్ గౌడ్ మరియు పసుపుల లక్ష్మణ్ అనే రైతులు మీడియాతో తమ గోడును వెల్లబోసుకున్నారు.

మండల వ్యాప్తంగా ఒక్క అనూషబాయి భూమినే కాకుండా దీర్ఘకాలికంగా అప్పులు చెల్లించకుండా ఉన్న రైతుల భూములను కూడా వేలం వేయడానికి బ్యాంకు అధికారులు సిద్ధమవుతున్నారన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 26 వ తేదీన పాల్త్య రేఖ అనే రైతు యొక్క భూమిని వేలం వేయడానికి కరపత్రాలను పంచుతున్నారని తెలిపారు.

పసుపుల లక్ష్మణ్ అనే రైతు 2017 లొ 4 లక్షల 32 వేలు రుణం తీసుకోగా ఈ రోజుకి 7 లక్షల 95 వేలు చెల్లించమంటున్నారని తెలిపారు. ఈ విధంగా రుణాలు తీసుకున్న రైతులు మండల వ్యాప్తంగా చాలా మంది ఉన్నారన్నారు.శాసన సభ ఎన్నికల కు ముందు రేవంత్ రెడ్డి బస్సు యాత్ర లో పర్యటించినప్పుడు.. అంకోల్ క్యాంప్ లో రుణాల గురించి రేవంత్ రెడ్డికి రైతులు వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు రైతులు తెలిపారు. ఆనాడు బ్యాంకు అధికారులు రైతుల ఇంటి తలుపులను తొలగించి తీసుకువెళ్తేనే అప్పటి ప్రభుత్వంపై మండిపడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గోడును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india