V1News Telangana

best news portal development company in india

గణిత ప్రతిభ పరీక్షలో నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థి…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ గ్రామీణ మండలానికి చెందిన బోర్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి జాహేద్ , గణిత దినోత్సవం సందర్భంగా తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం రోజు హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి గణిత శాస్త్ర ప్రతిభ పరీక్ష ఫలితాలలో రెండవ స్థానం సంపాదించాడు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, సహచర ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు జాహేద్ ను అదేవిధంగా ఆ విద్యార్థిని రాష్ట్రస్థాయిలో గణితశాస్త్రంలో ప్రతిభ కనబరిచి రెండవ స్థానంలో గెలుపొందే విధంగా నిరంతరం కృషిచేసి సంసిద్ధం చేసినందుకుగాను.. గణిత శాస్త్ర అధ్యాపకులు పద్మ శ్రీనివాస్ ను హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇలాగే చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరాలని ఆ విద్యార్థిని ఆశీర్వదించారు. రాష్ట్రస్థాయిలో గణిత శాస్త్రంలో రెండవ స్థానంలో నిలిచేందుకుగాను బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు పలువురు జాహేద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india