V1News Telangana

best news portal development company in india

అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం పార్లమెంట్ సభ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రోజు బహుజన సంఘం సభ్యులు అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా నసురుల్లాబాద్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉల్లెంగ కిరణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు మామిడి భూమయ్య మాట్లాడుతూ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కూడా విజ్ఞత లేకుండా ప్రపంచ మేధావి అయినటువంటి మా ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం. చులకనగా చేసి మాట్లాడం సరికాదన్నారు. ఆయన వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు.. మండల నాయకులను, డివిజన్, రాష్ట్ర నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి గొంతులు నొక్కాలని చూస్తున్నారని అన్నారు. మీరు ఎన్ని అరెస్టులు చేసిన ఈ ఉద్యమం ఆగదు ఎస్సీ వర్గీకరణ వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారత రాజ్యాంగ వ్యతిరేకులను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మామిడి చిన్న మక్కయ్య, ఉల్లెంగ రాములు, సంజీవ్, శివ కొర్రి మొగులయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india