– ఆశగా ఎదురుచూస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు
-స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక చొరవతో నూతన మండల ఏర్పాటుకు కృషి చేయాలి
– బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:బాన్సువాడ గ్రామీణ మండలం లోని హన్మాజీ పేట్ గ్రామాన్ని నూతన మండలం గా ప్రకటించాలని బిజెపి కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నూతన మండల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలైనప్పటికీ ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందని.. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని.. అందువల్ల హన్మాజీ పేట్ మండలం ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరుగుతున్నందున .. ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే హన్మాజీ పేట్ గ్రామాన్ని మండల కేంద్రం గా ఏర్పాటు చేయాలని అన్నారు. మంగళవారం రోజు జరిగిన శాసన సభ సమావేశంలో కొందరు శాసన సభ్యులు ఆయా నియోజక వర్గాల పరిధిలోని అర్హత కలిగిన గ్రామాలను నూతన మండలాలుగా ప్రకటించాలని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో చాలా రోజుల నుండి హన్మాజీ పేట్ గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటిస్తారేమోనని గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. అందువల్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకొని..ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరారు . మరొక విషయం గమనించినట్లయితే శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆగ్రోఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న కాసుల బాల్ రాజ్ హన్మాజీపేట్ పేట్ గ్రామానికి ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హన్మాజీ పేట్ గ్రామాన్ని మండలం గా ప్రకటిస్తాం అని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందువల్ల ఆయన కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసి అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








