V1News Telangana

best news portal development company in india

ప్రియతమ నేత కు జన్మదిన వేడుక నిర్వహించిన మండల నాయకులు……

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు సురేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపిటిసి కంది మల్లేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఏఎంసి చైర్మన్ పెర్క శ్రీనివాస్ హాజరయ్యారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం నాయకులు అందరూ పరస్పరం ఆప్యాయంగా స్వీకరించి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుంచు నారాయణ, ఖలీల్, చుంచు సాయిలు, వనం వెంకటేశ్వరరావ్, బొడిగె భాను ప్రకాష్ గౌడ్, ముస్త్యాల రవి, హరి, గౌస్, టేకుర్ల సాయిలు, ఫయాజ్, ఇమ్రాన్, అల్లం రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india