V1News Telangana

best news portal development company in india

రాజీమార్గమే రాచ మార్గం….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో శనివారం రోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 513 సివిల్ మరియు క్రిమినల్ కేసులను పరిష్కారం చేసినట్లు న్యాయమూర్తి టీఎస్పీ భార్గవి తెలిపారు. సోమవారం రోజు ఆమె పత్రికా ముఖంగా మాట్లాడుతూ రాజీ మార్గమే రాచమార్గమని .. ఒకరిపై ఒకరు పరస్పరం కేసులు నమోదు చేసుకోవడం వల్ల డబ్బుతోపాటు విలువైన సమయం కూడా వృధా అవుతుందని అన్నారు. ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చట్టాన్ని అందరూ గౌరవించాలని.. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చూసినట్లయితే న్యాయ పరిధిలో శిక్షింపబడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, రమాకాంత్, అయ్యాల సంతోష్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india