V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పత్రికా ప్రకటన వెలువరించారు. ఈ సందర్భంగా నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం అందించడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉధృతంగా చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం స్పందించి గురుకుల పాఠశాలల విద్యార్థులకు మెస్ చార్జీలు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురుకులాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారిపై ఒత్తిడి తీసుకురావడం వలన ముఖ్యమంత్రి స్పందించి గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు “న్యూ కామన్ డైట్ మెనూ”విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యార్థులకు నోణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించాలని లేనియెడల బిఆర్ఎస్ పార్టీ విద్యార్థుల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేయడానికి వెనుకాడబోదని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు గురుకులాలను సందర్శించి విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించే విధంగా ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్, టేకుర్ల సాయిలు, చుంచు శేఖర్, దొంతి భాస్కర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








