V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల, ప్రైవేట్ పాఠశాలల మరియు గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వారధి స్వచ్ఛంద సేవా సంస్థ బాన్సువాడ వారి ఆధ్వర్యంలో నెమ్లి గ్రామంలో గల శ్రీ సాయి ఫంక్షన్ హాల్ లో” ప్రేరణ” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ నుండి విచ్చేసిన వక్త సేవ కుమార్ పిల్లలకు జీవితంలో ఎలా ఉండాలి తల్లిదండ్రులను, గురువులను ఎలా గౌరవించాలి చదువుతోపాటు సంస్కారం ఎలా ఉండాలి అని అనేక విషయాలపై విద్యార్థులకు మంచి అవగాహనతో సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం విద్యార్థులకు ఎంతో తోడ్పడుతుందని.. వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులలో మానసికస్థైర్యాన్ని పెంపొందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

వారధి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారధి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఎన్నో నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని.. మా సంస్థ 2010 నుండి ఇప్పటివరకు విద్య, వైద్య మరియు పర్యావరణ రంగం మూడు రంగాలను ఎంచుకొని ఆయా రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సమాజానికి మరిన్ని సేవలు అందించాలని సంకల్పంతో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, వారధి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రధాన కార్యదర్శి వై. గోపాల్, ఉపాధ్యక్షులు డాక్టర్ కిషన్, కోశాధికారి బసవయ్య, సభ్యులు సుధాకర్, వేణుగోపాల్, సాయిలు, కృష్ణ, అనిల్, కోటయ్య, మహేందర్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు .
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








