Post Views: 94
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శనివారం రోజు లబ్ధిదారులు ఆఫ్రీన్ బేగం మరియు గులాం అలీ లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్, మాజీ ఎంపీటీసీ మహేందర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా వైద్య చికిత్స అందించుకున్న వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను మంజూరు చేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర గౌడ్, హైమద్, అజీమ్, రఫిక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








