Post Views: 78
V1న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల పరిధిలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చేరు మైసమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి గాను బోధన్ పట్టణం అంగర్గా గ్రామానికి చెందిన ఎల్ఐసి డెవలప్ మెంట్ ఆఫీసర్ మొమ్మనేని శివరామకృష్ణ తన వంతు సహాయంగా 10 వేల రూపాయలు విరాళం అందజేశారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం కొచ్చరి మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్, డాక్టర్ సాయిలు, జగన్, వడ్ల వెంకట్, కొచ్చరి మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








