V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన కురుమ కులస్తులు శనివారం రోజు హైదరాబాద్ లోని కోకాపేట్ సమీపంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కురుమల ఐక్యమత్యం మరియు అభివృద్ధి కొరకు నూతనంగా నిర్మించిన” దొడ్డి కొమురయ్య”కురుమ సంఘం భవన ప్రారంభోత్సవానికి బయలుదేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుమ కులస్తుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భవనాన్ని నిర్మించడం శుభ పరిణామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కురుమ సోదరులందరూ సంఘటితంగా మన హక్కుల సాధన కొరకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బీరప్ప, మండల యూత్ అధ్యక్షులు పీరయ్య, మాజీ సర్పంచ్ గంగొండ, రవి, అశోక్, సాయిలు, రాజు, భాస్కర్, కురుమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








