V1News Telangana

best news portal development company in india

గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన కార్పొరేషన్ చైర్మన్ …..

SHARE:

– క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతాయి

– మారుమూల గ్రామాలలో క్రీడలలో ప్రతిభావంతులను వెలుగు తీసేందుకే సీఎం కప్ నిర్వహణ

– ప్రభుత్వ సహకారంతో క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలి

– ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి గురువారం రోజు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన విద్యార్థులకు మానసిక ఉల్లాసం మరియు శారీరకదారుడ్యం కలుగుతుందని.. తద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మారుమూల గ్రామాలలో క్రీడలలో రాణించే ప్రతిభావంతులను వెలికి తీసేందుకు మంచి ఆలోచనతో సీఎం కప్ క్రీడలను మండలాల వారిగా నిర్వహించారని తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, నిమాని వీర్రాజు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు కాలేక్, కౌన్సిలర్ నందకిషోర్ గుప్తా, స్థానిక నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india