V1News Telangana

best news portal development company in india

రుద్రూర్ లో సీఎం కప్ పోటీలు ప్రారంభం..

SHARE:


నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పరిధిలోని జెడ్పి హెచ్ స్కూల్ లో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయన్నరు.గ్రామా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి తనవంతు కృషి చేస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గంలో ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడానికి శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి మరియు తాను ఎల్లప్పుడూ ముందుంటానని బాలరాజు అన్నారు.అంతకు ముందు ఆయన వివిధ గ్రామాల నుంచి క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలోఎంపీడీఓ, రుద్రూర్ ఎమ్ఈఓ, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సురేష్ బాబా , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్ర శేఖర్ , మండల అధ్యక్షులు తోట అరుణ్, మాజీ జెడ్పిటిసి నరోజి గంగారాం ,పత్తి రాము , లక్ష్మణ్ , ఖలేఖ్ , చిన్నారెడ్డి , షోయెబ్ , నితిన్, కిషన్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india