V1News Telangana

best news portal development company in india

అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గల “భవిత కేంద్రం”లో సోమవారం రోజు దివ్యాంగ విద్యార్థులకు ఆట పోటీలను నిర్వహించి అనంతరం వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి చందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని విద్యార్థులు అంగవైకల్యంతో కృంగిపోకుండా అన్ని రంగాల్లో రాణించాలని ధైర్యాన్ని నింపారు. ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రంగాలలో తగిన ప్రాధాన్యతను ఇస్తుందని తెలియజేశారు. పట్టుదలతో శ్రమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గునిగెరి హన్మండ్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ స్వప్న, ఐఈఆర్ పి రూప, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india