V1News Telangana

best news portal development company in india

అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఫిర్యాదు ఉన్నచో సంబందిత పోలీస్ అధికారులను సంప్రదించగలరు.

SHARE:

పోలీస్ కమీషనర్ కార్యాలయం

నిజామాబాద్

తేది : 5-12-2024

*ప్రజల సౌకర్యార్ధం సి.పి ఆఫీస్ సెంట్రల్ కాంప్లెంట్స్ సెల్: 8712659888 కు సంప్రదించగలరు: ఇంచార్జీ పోలీస్ కమీషనర్ వెల్లడి*

నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఫిర్యాదు ఉన్నచో సంబందిత పోలీస్ అధికారులను సంప్రదించగలరు. అట్టి ఫిర్యాదు పై చర్యలు తీసుకోనియెడల సంబందిత సి.ఐ గారి కి అట్టి ఫిర్యాదు గురించి తెలియజేయగలరు. అక్కడ కూడా చర్యలు తీసుకోనియెడల సంబంధిత ఎ.సి.పి గారికి అట్టి ఫిర్యాదు గురించి తెలియచేయగలరు. అక్కడ కూడా తగు చర్యలు తీసుకోనట్లయితే చివరికి *పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని సెంట్రల్ కాంప్లెంట్స్ సెల్ నెంబర్ : 8712659888* కు సంప్రదించగలరు.

ఇందుకోసం అన్ని పోలీస్ స్టేషన్స్ ముందు భాగంలో ఒక బోర్డు మీద సంబంధిత పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్ పొందపరుచుతూ బోర్డు రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఫిర్యాదు దారులకు సంబంధించిన ఏలాంటి ఫిర్యాదును అయిన సంబంధిత పోలీస్ స్టేషన్స్ యందు సంప్రదించగలరు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదతో మాట్లాడి వారి ఫిర్యాదును త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు *నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సిందూ శర్మ, ఐ.పి.యస్., గారు ఆదేశాలు జారీచేయడం జరిగింది*.

*కమీషనర్ అఫ్ పోలీస్*
*నిజామాబాద్*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india