V1News Telangana

best news portal development company in india

బయో సైన్స్ సబ్జెక్టులో విద్యార్థులకు మండల స్థాయి ప్రావీణ్య పరీక్ష…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజు మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బయోసైన్స్ సబ్జెక్టులో మండల స్థాయి ప్రావీణ్య పరీక్షను నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా మండల విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరించారు. 14 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ప్రావీణ్య పరీక్షలో పాల్గొన్న విద్యార్థుల్లో బాలికల విభాగంలో పి .మానస పదవ తరగతి తెలుగు మీడియం (దుర్కి) మొదటి స్థానం, డి.హారతి పదవ తరగతి తెలుగు మీడియం( నస్రుల్లాబాద్) రెండవ స్థానం, బాలుర విభాగంలో జి. బాలాజీ పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం(నెమ్లి) మొదటి స్థానం, డి. జగన్ పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం గిరిజన గురుకుల పాఠశాల (నసురుల్లాబాద్) విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు జిల్లా స్థాయి ప్రావీణ్య పరీక్షలో పాల్గొంటారని మండల విద్యాశాఖ అధికారి చందర్ తెలిపారు. విద్యార్థులలో గల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఈ పరీక్ష విధానాన్ని నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.

ఈ విధంగా సబ్జెక్టుల వారీగా ప్రావీణ్య పరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులలో నైపుణ్యం మరియు మేధాశక్తి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సక్రమంగా వినియోగించుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బయో సైన్స్ సబ్జెక్టు మండల ఇన్చార్జి ఇందిర, గునిగెరి హన్మండ్లు, వీణ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india