V1News Telangana

best news portal development company in india

జిల్లాస్థాయి ఇన్స్పైర్ , రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే……

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కామారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12వ జిల్లా స్థాయి ఇన్ స్పైర్(DLEPC) మరియు 52 వ జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన(RSBVP) 2024-25 ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజ్ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని బాన్సువాడ పట్టణంలో జరుపుకునే అవకాశం కల్పించిన జిల్లా విద్యాశాఖ శాఖ అధికారులకు స్థానిక నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ప్రతిభను కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా విద్యాధికారి రాజు, ,జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి, PRTU జిల్లా అధ్యక్షులు కుషాల్ , వివిధ మండలాల MEO లు,ప్రజాప్రతినిధులు నాయకులు,అధికారులు,ఉపాద్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india