V1News Telangana

best news portal development company in india

చట్టాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి…..

SHARE:

– ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం వల్ల డబ్బు మరియు సమయం వృధా అవుతుంది

– డిసెంబర్ 14న జరిగే లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చు

– జూనియర్ సివిల్ కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ అధికారిక కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజు కోర్టు న్యాయమూర్తి టీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఒకరిపై ఒకరు పరస్పరం కేసులు నమోదు చేసుకోవడం వల్ల డబ్బుతో పాటు సమయం కూడా వృధా అవుతుందని అన్నారు. డిసెంబర్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ప్రజలు కేసులు రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని బాధితులు వినియోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవలసిందిగా తెలిపారు.

అనంతరం మండల న్యాయ సేవ అధికారిక కమిటీ ఆధ్వర్యంలో సెవెన్ హిల్స్ ఆసుపత్రి వారి సహకారంతో సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని న్యాయమూర్తి టీఎస్పీ భార్గవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు కోర్టు సిబ్బందికి మరియు కోర్టుకు హాజరైన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాదులు లక్ష్మారెడ్డి, ఖలీల్, భూషణ్ రెడ్డి, అయ్యాల ఆనంద్, కోర్టు సిబ్బంది సాయిబాబా, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india