V1News Telangana

best news portal development company in india

జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు….

SHARE:

V1 న్యూస్ బోధన్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శన (సైన్స్ ఫేర్) లో రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలో జెడ్ పి హెచ్ ఎస్ సాలూర విద్యార్థులు పాల్గొని మొదటి బహుమతి గెలుపొందారు. 9వ తరగతి కి చెందిన బి.శశాంక్ , బి. హర్షవర్ధన్, వృద్ధులకు మాడిఫైడ్ వాకర్ తయారుచేసి ప్రదర్శించారు. వృద్ధులు వాకర్ సహాయంతో నడిచినప్పుడు…. విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నిల్చుని ఉన్న దగ్గరే కూర్చునేటట్లు వాకర్ ను రూపొందించారు.

ఈ ప్రదర్శనలో అధిక సంఖ్యలో వీక్షకులు వాకర్ ను ఆసక్తిగా తిలకించారు. ఇది వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థుల మేధాశక్తిని పలువురు ప్రశంసించారు. విద్యార్థులు బహుమతి గెలుపొంది పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చినందుకు వారిని మండల విద్యాధికారిని రాజీ మంజుష, గైడ్ టీచర్లు రుద్ర, సంతోష్ కుమార్ యాదవ్, విఠల్ కాంబ్లే, లింబగిరి, జ్యోత్స్న, విజయలక్ష్మి అందరూ కలిసి అభినందించి వారికి నగదు ప్రోత్సహకం అందించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india