V1News Telangana

best news portal development company in india

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన గ్రామస్తులు….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో శుక్రవారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, సామాజిక న్యాయం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గ్రామస్తులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.

అనంతరం గ్రామంలో మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ మరియు పిఎసిఎస్ చైర్మన్ కురుమ గంగారం చేతుల మీదుగా చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్ గౌడ్, రామ్ రెడ్డి, సాయిలు, లక్ష్మణ్, భాస్కర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india