– పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
– రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు వర్ణనాతీతం
– ప్రభుత్వంతో కొట్లాడి హక్కులు సాధించుకోవాలి
– బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజారామ్ యాదవ్
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులు ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ వరకు చివరి గడువు ఉందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్ అన్నారు. బుధవారం రోజు బాన్సువాడ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు తమ తలరాతలను మార్చుకునేందుకు ఓటు హక్కును ఆయుధంగా వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడం వల్ల చట్టసభల్లో పట్టభద్రుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధించుకోవచ్చని తెలిపారు.

అనంతరం పట్టణంలో గల గ్రంధాలయంను సందర్శించి రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను.. ఉద్యమ నేపథ్యంపై ముచ్చడించారు. పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, శివ సూరి, లింగం, మహేష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








