V1News Telangana

best news portal development company in india

వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతు సంబరాల…..

SHARE:

– చందూరి హన్మాండ్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతు సంబరాలు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదు అన్నారు. ఇప్పటివరకు నాలుగు విడతలలో మాఫీ చేసినప్పటికీ రుణమాఫీ అందరికీ వర్తించలేదని.. ఎన్నికల సమయంలో పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు నిబంధనల పేరిట చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పెట్టకుండా పాస్ బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణ మాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ రైతు భరోసా కంటే రైతులకు బోనస్ మేలని చెప్పడం “రైతు భరోసా” ఎత్తి వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికి వానాకాలం రైతు భోరోసా కూడా ఇవ్వలేదు.. నిన్న జరిగినటువంటి” రైతు పండుగ” సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి మాట్లాడకపోవడం ఇది నిజమనే సంకేతం ప్రజల్లోకి వెళుతుంది అన్నారు. కౌలు రైతులకు ఎకరానికి 15000, రైతు కూలీలకు 12000 సంవత్సరానికి ఇస్తామని అమలు చేయలేదని.. భూమి లేని రైతులకు రైతు బీమా , అదేవిధంగా జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు..నకిలీ విత్తనాలు, పురుగుమందుల విషయంలో నష్టపోయిన రైతులకు అమ్మిన వారి దగ్గర నుండి పరిహారం చెల్లించే విధంగా చేస్తామని అన్నారు వాటిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. అదేవిధంగా పోడు భూములకు మరియు అసైన్డ్ భూములకు క్రయ,విక్రయాలు జరిగే విధంగా చేసి భూయాజమాన్య హక్కులు కల్పించే విధంగా చేస్తామని.. ధరణి పోర్టల్ రద్దుచేసి దాని స్థానంలో సరికొత్త రెవిన్యూ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ధరణి వల్ల చాలామంది రైతులు నష్టపోయారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త చట్టం ఎందుకు తీసుకురావడం లేదు అదేవిధంగా పంటల బీమా పథకం పెట్టి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి నష్టపోయిన రైతులకు అందిస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఇప్పటివరకు ఆదుకోలేదు అన్నారు.ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని చెప్పి ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఎకరాలకు నీరు అందించారో చెప్పాలని సవాల్ చేశారు.మరియు రైతు కమిషన్,నూతన వ్యవసాయ విధానం హామీ ఏమైంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ వేదికలో “రైతుబిడ్డ డిక్లరేషన్”లో ఇచ్చిన ప్రతి ఒక్క హామిని నెరవేర్చాలి.. అలా చేయకుండా “రైతు సంబరాలు” పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తూ, కాలయాపన చేయవద్దని డిమాండ్ చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india