V1News Telangana

best news portal development company in india

మాలల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు మండల అంబేద్కర్ కమిటీ నాయకులు ఎస్సీ వర్గీకరణతో మాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాలల సింహ గర్జన కరపత్రాలను ఆవిష్కరించి.. అనంతరం గ్రామంలో మాలలకు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో జరగబోయే మాలలసింహగర్జన భారీ బహిరంగ సభ తరలింపు ఏర్పాట్ల గురించి ప్రతి మాల సోదరుల కుటుంబ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. సింహగర్జన బహిరంగ సభకు హాజరై మాలల ఐక్యతను చాటాలని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేధావులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. సింహగర్జన బహిరంగ సభ ని విజయవంతం చేయాలని నసురుల్లాబాద్ అంబేద్కర్‌ కమిటీ అధ్యక్షుడు బాల సాయిలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ,పోశెట్టి, ప్రధాన కార్యదర్శి నీరడి లక్ష్మణ్, సమాచార సభ్యుడు శ్రీనివాస్, సలహాదారులు శ్రావణ్ కుమార్ ,సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india