V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు సర్వ శిక్ష ఉద్యోగులు ఎం ఆర్ సి భవనం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు మండల అధ్యక్షులు గునిగెరి హన్మండ్లు మాట్లాడుతూ ప్రభుత్వం సర్వ శిక్ష ఉద్యోగుల డిమాండ్ లను పరిష్కరించాలని అన్నారు. వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని.. రీ ఎంగేజ్ లేకుండా చూడాలని అదేవిధంగా మెడికల్ రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్ టియు మండల ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్, రాష్ట్ర బాధ్యులు హన్మండ్లు, పండరి గౌడ్, కిషన్ లాల్, గోపాల్, బాలరాజ్ మరియు మండల సర్వ శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








