Post Views: 80
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల రెండు అంగన్వాడి కేంద్రాలను బుధవారం రోజు ఇన్చార్జి డిడబ్ల్యూ చందర్ నాయక్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

తక్కువ బరువుతో ఉన్న పిల్లలను తూకం వేసి పరిశీలించారు. పిల్లలకు నాణ్యత కూడిన భోజనం అందించాలని సూచించారు. ఆన్ లైన్ యాప్ ప్రకారం పిల్లలు హాజరయ్యారో లేదో గమనించారు.

అంగన్వాడి కేంద్రంలో నిర్వహించే పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ సీడీవో సౌభాగ్య, సెక్టార్ సూపర్వైజర్ వాణి పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








