V1News Telangana

best news portal development company in india

ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి….

SHARE:

– వ్యక్తి ఎదుగుదలకు విద్య ప్రధాన ఆయుధం

– విద్యార్థులు సేవాభావాన్ని.. నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

– భావి భారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవ్వాలి

– బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి భార్గవి

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం రోజు గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ మరియు న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి భార్గవి మరియు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి భార్గవి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఎదుగుదలకు విద్య ప్రధాన ఆయుధమని అన్నారు. విద్యార్థులు సేవాభావాన్ని.. నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భావి భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, అడ్వకేట్ దత్తాత్రేయ, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india