V1News Telangana

best news portal development company in india

నసురుల్లాబాద్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించిన మాల సోదరులు …..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాల సోదర సోదరీమణులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాలల సింహగర్జన కార్యక్రమం యొక్క కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ దేశంలోని పౌరులందరికీ కుల, మత, ప్రాంత, పేద, ధనిక భేదాలు లేకుండా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలను తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కొంతమంది నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కొరకు మనలో ఉన్న ఐక్యమత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఈ విషయాలను అందరూ దృష్టిలో ఉంచుకొని ..ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందున మాలలు అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని.. డిసెంబర్ 1 వ తేదీన హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాలల సింహగర్జన కార్యక్రమానికి ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు, యువజన సంఘాలు, మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి మన హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ గ్రామ అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు మామిడి భూమయ్య, కిరణ్, రాములు, భరత్, చిన్న సంగయ్య, శివ, సంజీవ్, లక్ష్మి, గంగామణి, లింగవ్వ, బషవ్వ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india