V1News Telangana

best news portal development company in india

ఫీజు కట్టు గేటు లోపల అడుగు పెట్టు….

SHARE:

హాస్టల్ లో ఉండకపోయినా హాస్టల్ ఫీజ్  కట్టాల్సిందే….

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాల లో లక్షల ఫీజులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫీజు కట్టడానికి వెనుక ముందు అయ్యే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేట్ యాజమాన్యల టార్చర్ అంత ఇంతా కాదు ఫీజు కట్టని స్టూడెంట్ కు గేటు బయట నిలబెడతారు ఫీజు కడితేనే స్టూడెంట్ కు లోపల క్లాస్ రూమ్ లో తీసుకుంటారు. తమ తోటి విద్యార్థులతో చదువుకునే ఆ విద్యార్థులు వాళ్ళందరి ముందట తలదించుకొని గేటు బయట నిలబడి మనస్థాపానికి గురవుతున్నారు. రికాడేదాకా డోక్కడిని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు తము చేస్తున్న కష్టం పిల్లలు చూడకూడదని అలాంటి కష్టం వాళ్ళు చేయకూడదని ప్రవేట్ సంస్థలో పిల్లలను చదివిస్తున్నారు ప్రభుత్వ సంస్థల్లో నేటి యుగానికి కావలసిన విద్యా దొరకపోవడమే ప్రైవేట్ సంస్థల వైపు తమను ఆకర్షితం చేస్తుందని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫీజు కట్టడానికి ఒక నెల అటు ఇటు అయితే ఆ పిల్లలను గేటు బయట నిలబెట్టి వాళ్ళ తడి తల్లిదండ్రులను పిలిపించి ఫీజు కట్టాలని లేనియెడల ఎగ్జామ్స్ రాయించమని ఒత్తులు చేస్తున్నట్టు కొందరు తల్లిదండ్రులు మీడియా ముందు వచ్చి చెబుతున్నారు. అదేవిధంగా హాస్టల్లో తప్పనిసరిగా విద్యార్థులు ఉండాలని ప్రైవేట్ యాజమాన్యులు కండిషన్ పెడుతున్నారు హాస్టల్లో లేకున్నా హాస్టల్ ఫీజు తప్పనిసరిగా కట్టాల్సిందేనని తము అప్ అండ్ డౌన్ చేసిన హాస్టల్ లో ఎంత ఫీజు అయితుందో అదే ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. లక్షల్లో ఫీజులు తీసుకుంటున్న ఆ ప్రైవేట్ పాఠశాలల పైన నిజామాబాద్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల మనుభావాలను దెబ్బ తీస్తున్న ప్రయివేట్ సంస్థపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india