V1News Telangana

best news portal development company in india

శ్రీ జగదాంబ మాత-సేవలాల్ మహారాజ్ విగ్రహాల ప్రతిష్టాపన……

SHARE:

V1 న్యూస్ మోస్రా ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా మండల పరిధిలోని చే(6) నంబర్ తండాలో నూతనంగా నిర్మించిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ మాత-సేవాలాల్ మహారాజ్ ల ఉత్సవాలలో భాగంగా చివరి రోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం గ్రామ ప్రజలు ఆలయానికి ప్రహరీ గోడ మరియు గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజల కోరిక మేరకు ప్రహరీ గోడను మరియు సిసి రోడ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india