V1News Telangana

best news portal development company in india

ఘనంగా కాలభైరవ స్వామి ఉత్సవాలు…..

SHARE:

– భక్తజన సందోహంగా ఆలయ పరిసరాలు

– కన్నుల పండుగగా రథోత్సవం

– అగ్నిగుండం ప్రవేశం చేసిన భక్తులు

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి-ఇసన్నపల్లి , గ్రామాల మధ్య వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఉత్సవాలు గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో ఆదివారం రోజు తెల్లవారుజామున అగ్నిగుండం ఏర్పాటు చేశారు. దగదగ మండే నిప్పుల రవ్వల పై భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రవేశించి నడుచుకుంటూ బయటికి వెళ్లారు. అనంతరం ఉదయం స్వామివారి రథోత్సవము ఊరేగింపు నిర్వహించారు.

రథాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్టించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథయాత్ర నిర్వహించారు. స్వామివారి నామ జపాన్ని స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో, భజన సంకీర్తనలతో రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india