– వృద్ధులను చూసి చలించిపోయిన చిన్నారులు
– మానవతా దృక్పథంతో దుప్పట్లు పంపిణీ
– చిన్నారులను అభినందిస్తున్న పట్టణ ప్రజలు
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో యాచకులుగా ఉన్న కొందరు వృద్ధులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని చూసి మానవతా దృక్పథంతో మనస్సు చలించిపోయిన కొందరు చిన్నారులు రూ. 5000 పోగుచేసి ఆదివారం రోజు వారికి దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్ మాట్లాడుతూ చిన్నారులు వయస్సులో చిన్నవారైనప్పటికి వారి మనసులు గొప్పగా ఆలోచించాయని కొనియాడారు. విద్యార్థి దశ నుండే ఇతరులకు సహాయపడాలన్న మంచి లక్షణాలు అలవర్చుకోవడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చరణ్, సాక్షిత్, సయ్యద్ నిహాల్, సన్నీ, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..