V1News Telangana

best news portal development company in india

సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులపై చలి పంజా

SHARE:

– ప్రారంభమైన చలి తీవ్రత,కప్పుకోవడానికి రగ్గులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

– రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు రగ్గులు, స్వెటర్లు పంపిణి చేయాలి

– (A.I.S.B) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్

V1 న్యూస్ ఉమ్మడి జిల్లాల ప్రతినిధి:

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: చలికాలం ప్రారంభం అవడంతో చలి తీవ్రత రోజుకు పెరుగుతుంది ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహల్లో విద్యార్థులకు అందించే రగ్గులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పంపిణి చేయకపోవడంతో విద్యార్థులు చలి బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా,అధికారులు మారినా సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మాత్రం తిప్పలు తప్పడం లేదని ఆయన వాపోయారు.ఒక వైపు సరైన మౌలిక వసతులు లేని అద్దె భవనాలలో వసతి గృహాల నిర్వహణ కొనసాగుతుంటే ఆ భవనాలకు సరైన కిటికీలు,తలుపులు లేకపోవడంతో చలి బారినపడి విద్యార్థులు నరకాయతన అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రగ్గులను పంపించడంలో అలసత్వం వహించడం వలన విద్యార్థులు రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.పేద విద్యార్థులంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపో లేదా వారికి ఓటు హక్కు లేదనే కారణమో తెలియదు కానీ విద్యార్థులకు అందించే మౌలిక సదుపాయాల కల్పన పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం పట్ల విద్యార్థుల తల్లి,తండ్రులు మండిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు 2019 లో నాణ్యత గల రగ్గులను ప్రభుత్వం పంపిణి చేసింది అప్పటి నుండి ఇప్పటి వరకు నాసిరకమైన పలుచని రగ్గులను పంపిణి చేయడం జరిగిందని ఆయన అన్నారు.చలి నుండి విద్యార్థులు రక్షణ పొందేందుకు నాణ్యత కలిగిన రగ్గులతో పాటు స్వెటర్లను ప్రభుత్వం వెంటనే పంపిణి చేయాలి అదేవిధంగా కిటికీలు,డోర్లు లేని పాత భవనాలను మరమ్మత్తులు చేయించి విద్యార్థులను చలి బారి నుండి కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సకాలంలో విద్యార్థులకు రగ్గులను పంపిణి చేయాలనీ ఆయన కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india