V1News Telangana

best news portal development company in india

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నసురుల్లాబాద్ ప్రఖండ నూతన కమిటీ ఎన్నిక…..

SHARE:

మండల కేంద్రంలో గల రామాలయం ఆవరణలో శనివారం రోజు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రఖండ ఎన్నిక కార్యక్రమం నిర్వహించి.. వారికి పదవి బాధ్యతలను అప్పగించారు.

ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ మాట్లాడుతూ హిందూ ప్రజలందరూ హైందవ ధర్మాన్ని, హిందువుల సంస్కృతి సాంప్రదాయాలను, దేవాలయాలను మరియు మతమార్పిడుల నుండి హిందూ బంధువులను అదేవిధంగా లవ్ జిహాద్ మాయలో పడిపోతు జీవితాలను కోల్పోతున్న హిందూ సోదరీమణులను.. గోమాతను, భూమాతను కాపాడుతామని హిందూ దేవతల జోలికొస్తే సహించమని హైందవ ధర్మ రక్షక దళాలుగా పనిచేస్తూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పట సత్సంగాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా త్రి ప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్, జిల్లా గోరక్షక్ తులసీదాస్, పాల్గొన్నారు. నూతన కమిటీ అధ్యక్షుడు అరిగె నారాయణ, ఉపాధ్యక్షుడు ఆరేళ్ల సునీల్ గౌడ్, కోశాధికారి అంజయ్య, కార్యదర్శి శివసాగర్, సస్టాంగ్ ప్రముఖ్ రాఘవ, ధర్మ ప్రసాద్ వినోద్, సంయోజక్ నాగరాజు, సాహసంయుజక్ బండారి కృష్ణ, గోరక్షక్ సంయోజక్ మహదేవ్ రామకృష్ణ, బలోపసన్ మహేందర్, సేవా ప్రముఖ్ చంద్రకాంత్, ప్రచార ప్రముఖ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india