V1News Telangana

best news portal development company in india

బంగారు ఆభరణాలు లాక్కొని తలపై బలంగా కొట్టి హత్య చేసిన దుండగులు……

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: భిక్కనూరు మండలం లోని కంచర్ల గ్రామంలో మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి చంపినట్లు బుధవారం రోజు గ్రామస్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సుగుణ (46) తన పొలం వద్ద పనిచేస్తున్న చోటుకి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తన మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును లాక్కొని దాడి చేయడంతో పెనుగులాటలో ఆమె తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని నేరస్తుల కొరకు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. పుస్తెలతాడు లాక్కునే సమయంలో ఆమె దుండగులతో ప్రతిఘటించడం వలన వారు ఆమె తలపై దాడి చేసి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో ఐదు హత్యలు ప్రజలకు కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. మహిళలు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india