V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలో గల ప్రభుత్వాసుపత్రిని బుధవారం రోజు శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో గల మౌలిక సదుపాయాల గురించి మరియు వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి రోగులు, ప్రజలు తెలిపే సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. విధి నిర్వహణ పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india