V1News Telangana

best news portal development company in india

ఆటో డ్రైవర్ల సమస్యలపై సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు…..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం జీవనభృతి కల్పించాలని కోరుతూ బుధవారం రోజు సిఐటియు ఆధ్వర్యంలో బస్ డిపో నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోలతో డ్రైవర్లు ర్యాలీగా వెళ్లారు. డ్రైవర్లు మరియు సిఐటియు నాయకులు అందరూ కలిసి సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని సంపాదనతో కుటుంబాలను పోషించలేక.. పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించలేక మరియు ఆటో ఇన్ స్టాల్ మెంట్ భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఆటో డ్రైవర్లు అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన ఆటో డ్రైవర్లకు జీవనభృతి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు, ఆటో యూనియన్ నాయకులు చాంద్, అప్సర్, విజయ్, మల్లేష్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india