Post Views: 125
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీకి చెందిన ఫజియా అనే ఐదేళ్ల చిన్నారిపై మంగళవారం రోజు వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానికుల సహాయంతో అదృష్టవశాత్తు కుక్కల బారి నుండి బాలిక కాపాడబడింది అని తెలిపారు.

బాలిక తండ్రి షేక్ అక్తర్ స్థానికులతో కలిసి వెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేసే సమయంలో కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కమిషనర్ అందుబాటులో లేరని ఆయన తెలిపారు. ఇప్పటికైనా వీధి కుక్కల విషయంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని కుక్కల బెడదనుండి ప్రజలను కాపాడాలని కోరారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








