V1News Telangana

best news portal development company in india

ప్రమాదవశాత్తు దగ్ధమైన కారు….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలో గల వాసవి స్కూల్ సమీపంలో గల కాలనీలో ఆదివారం రోజు ఓ వ్యాపారస్తునికి చెందిన కారు ప్రమాదవశాత్తు దగ్ధమైపోయింది. హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి వచ్చిన వ్యాపారి ఇంటి సమీపంలో కారు ఆపి ఇంట్లోకి వెళ్ళాడు. అతను ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి కారులోంచి పొగలు, వంటలు రావడం చూసిన కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిగా.. ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. కాలుతున్న చెత్తకుప్ప పక్కనే కారును నిలపడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india