V1News Telangana

best news portal development company in india

బాన్సువాడ పట్టణ కేంద్రంలో శునకా(కుక్క)ల స్వైర విహారం…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో పలు వీధుల గుండా మరియు ప్రధాన రహదారులపై శునకాలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు వాటిని చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాహనదారులు సైతం వాటిని చూసి జంకుతున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పసికందులపై కుక్కలు దాడి చేసి చంపి.. నిర్దాక్షిణ్యంగా పీక్కు తిని వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చిన ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదేశానుసారం స్పందిస్తూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. తర్వాత యధావిధిగా మొద్దు నిద్ర పోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు సత్వరమే స్పందించి శునకాల బెడద నుండి ప్రజలను కాపాడాలని బాన్సువాడ పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india