V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారును కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు……

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నికైన దుర్కి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి దుర్గం శ్యామల శ్రీనివాస్ గురువారం రోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తనను మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి ప్రతాప్ సింగ్, మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్, మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ సభ్యులు అబ్దుల్ మాజీద్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india