V1News Telangana

best news portal development company in india

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు.. !

SHARE:

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు..

భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు బోధన్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిదులు, రాజకీయ నాయకులు పోస్టాఫీసు వద్ద గల నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ మొదటి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నెహ్రూ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనించడానికి వీలుగా చేపట్టిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయని పలువురు అన్నారు. భారత స్వతంత్ర సంగ్రామంలో ఆయన చూపిన చొరవ మరువలేనిదని అన్నారు. ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు ఇచ్చిన గౌరవంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, కౌన్సిలర్ లు తూము శరత్ రెడ్డి, మీర్ నజీర్ అలీ, జావిద్, శ్రీకాంత్ గౌడ్, అబ్దుల్లా, మారుతి మందిరం చైర్మన్ శంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తలారి నవీన్, నాయకులు బొగ్గుల ప్రభాకర్, బ్యాటరీ బాబా, అహ్మద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india