V1News Telangana

best news portal development company in india

నసురుల్లాబాద్ రామాలయంలో సీతారాముల పల్లకి సేవ నిర్వహించిన గ్రామస్తులు…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల రామాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం రోజు సాయంత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామ ప్రజలు యువకులు , పెద్దలు, మహిళలు అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో మంగళ హారతులతో పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. పల్లకి సేవ కార్యక్రమం ఇప్పటినుండి ప్రతి గురువారం రోజు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో భక్తులు స్వామివారి నామస్మరణలతో.. భక్తి గీతాలు ఆలపిస్తూ, భజన మరియు ఆటపాటలతో ఉత్సాహంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. పల్లకి సేవ కార్యక్రమంలో పురుషులతోపాటు మహిళలు సైతం మేము కూడా పల్లకి సేవలో భాగస్వాములమవుతామని పాల్గొన్నారు. అనంతరం హారతి నిర్వహించి.. పురోహితులు భక్తులకు ఆశీర్వచనం అందించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో.. సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అరిగె నారాయణ, వైస్ చైర్మన్ గుత్తుల శ్రీనివాస్, పురోహితులు భరద్వాజ్ నారాయణ, హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు జనపల సాయిలు, గొడిసెల యాదగిరి గౌడ్, రామిరెడ్డి, ఆప్టే గణేష్ కుమార్, ఇల్లెందుల సాయా గౌడ్, నరేష్ పటేల్, దంతూరి మైశాగౌడ్, జగదీష్ కులకర్ణి, నార్లవార్ రాము, పసుపు సాయిలు, రాఘవ, వీరు సింగ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india