V1News Telangana

best news portal development company in india

రామగుండం వైద్య కళాశాలలో నిర్వహించిన వైట్ కోట్ సేర్మనీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

SHARE:

రామగుండం వైద్య కళాశాలలో నిర్వహించిన వైట్ కోట్ సేర్మనీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

రామగుండం వైద్య కళాశాలలో నిర్వహించిన వైట్ కోట్ సేర్మనీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పేద్దపల్లి/రామగుండం నవంబర్ -07:

వైద్యవృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం  రామగుండంలోని సింగరేణి వైద్య కళాశాలలో నిర్వహించిన వైట్ కోట్ సేర్మనీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ  వైద్యులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాలను వైట్ కోట్ సేర్మనీ గుర్తు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.  గత 2.5 సంవత్సరాలుగా మీరు చేసిన కృషి ఫలితంగా ఈ రోజు వైట్ కోట్ సర్మనీ లో పాల్గొంటున్నారని, ఇక్కడ విద్యార్థులు వివిధ ప్రాంతాలు, సామాజిక ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చిన వారు ఉన్నారని, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృషి ఉందని అన్నారు.సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గత 3 సంవత్సరాలుగా ఉన్నతమైన సేవలు అందిస్తుందని, విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య కళాశాల గా  తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు.  రాబోయే 4,5 సంవత్సరాలు మీ జీవితంలో చాలా కీలకం కాబోతుందని, అనేక సార్లు నిరుత్సాహపడే పరిస్థితులు రావచ్చని, ఒత్తిడి పెరగవచ్చని, ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకం ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, గత రెండున్నర సంవత్సరాలుగా చూపించిన ధైర్యం భవిష్యత్తులోనూ కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు. సింగరేణి వైద్య కళాశాల నుంచి మొదటి బ్యాచ్ గా వచ్చే 150 మంది వైద్యులు ప్రపంచంలోనే నలుమూలల్లో ఎక్కడ ఉన్న ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ కళాశాలకు గర్వకారణంగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india