V1News Telangana

best news portal development company in india

V1 న్యూస్ తెలంగాణ కథనంతో కదం తొక్కిన ప్రతిపక్షం బిఆర్ఎస్ నాయకులు ||| రామగుండం మున్సిపల్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకుల రగడ |||

SHARE:

V1 న్యూస్ తెలంగాణ కథనంతో కదం తొక్కిన ప్రతిపక్షం బిఆర్ఎస్ నాయకులు |||

రామగుండం మున్సిపల్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకుల రగడ |||

 

 

 

V1 న్యూస్ తెలంగాణ కథనంతో కదం తొక్కిన ప్రతిపక్షం బిఆర్ఎస్ నాయకులు |||

రామగుండం మున్సిపల్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకుల రగడ |||

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 06:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని మంగళవారం జరిగిన సిరి ఫంక్షన్ హాల్ కూల్చివేతపై ప్రతిపక్ష నాయకులు కదం తొక్కారు. అయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా మంగళవారం సిరి ఫంక్షన్ హాల్ కూల్చివేతపై V1 న్యూస్ తెలంగాణ లో రాసిన కథనానికి బుధవారం బిఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున చేరుకొని మున్సిపల్ కార్యాలయము ముట్టడి చేసి ధర్నా చేపట్టారు. ఇన్నాళ్లకు ప్రతిపక్షం గళం విప్పడంతో మున్సిపల్ కార్యాలయం ఒకసారిగా ఘాటుగా మారింది. ఈ సందర్భంలో బిఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలను నోరు విప్పకుండా సైలెంట్ గా ఉండడం పైన అనేక ప్రశ్నలు వెలువడడం ప్రశ్నార్థకం. బిఆర్ఎస్ నాయకుల కదంతో ప్రతిపక్షం ఇలానే ముందుకు సాగుతుందా లేదా అని పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు.మున్సిపల్ అధికారులు అధికార పార్టీ ఆదేశాల మేరకు ఖని అడ్డగుంటలో ఉన్న సిరి ఫంక్షన్ హాల్ ఒక్కటే కూల్చి వేయడంతో ప్రతిపక్షం కంఠం విప్పింది అనొచ్చు . రాబోయే కాలంలో ప్రతిపక్షం పోరు అధికార పార్టీకి దిటుగా కొనసాగుతుందని అనేక ప్రశ్నలు ప్రజల్లో నెలకుంది. మున్సిపల్ అధికారుల తీరుపై ప్రతిపక్ష పోరు ముందుకు సాగుతుందా మధ్యలోనే ఆగుతుందా అనేది వేచి చూడాల్సిందే అని వినికిడి. .

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india