ఖనిలో వేడెక్కనున్న రాజకీయం
సిరి ఫంక్షన్ హాల్ కూల్చివేత కక్ష సాధింపు చరియైన?
సిరి ఫంక్షన్ హాల్ ఒక్కటే కూల్చివేస్తారా మిగతా ఫంక్షన్ హాల్లపై వేటు ఉంటుందా?





V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 05:-
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కాకతీయ నగర్ లోని సిరీ ఫంక్షన్ హాల్ కూల్చివేత నోటీస్ పీరియడ్ ఉన్నప్పటికీ ఫంక్షన్ హాల్ కూల్చివేయడం పై ఆవేశం వ్యక్తం చేస్తున్న బాధితులు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని పేరుమోసిన ఫంక్షన్ హాల్ లో ఒకటి సిరి ఫంక్షన్ హాల్ అయితే దాన్ని అమానుషంగా కూల్చివేయడంపై ప్రతిపక్షం మండిపడుతుంది. అనేక అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ మొదట సిరి ఫంక్షన్ హాల్ కూల్చివేతలు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రతిపక్షాలు వాపోతున్నారు. సిరి ఫంక్షన్ హాల్ కూల్చి వేత పై వేడెక్కనున్న రాజకీయం ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగానే తీసుకుంటున్న ప్రతిపక్ష నేతలు. ప్రభుత్వం మారినంక ప్రతిపక్షాలు సైలెంట్ గా ఉండడం పై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ త్వరలో రామగుండంలో ప్రతిపక్ష పోరు సాగుతుందని మేధావుల అంచనా. రామగుండంలో సిరి ఫంక్షన్ హాల్ ఒకటే కూల్చివేస్తారా లేదా మిగతా ఫంక్షన్ హాల్స్ పైన ఇదే చర్య కొనసాగుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇకముందు ఏం జరుగుతుందో అని ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులు వేసి చూడాల్సిందే.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








