Post Views: 117
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో గల జ్యోతిబాపూలే పాఠశాలను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదివారం రోజు ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో చర్చలు జరిపి అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం భుజించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని ..అదేవిధంగా నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








