V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం రోజు ఏనుగు రవీందర్ రెడ్డి సైన్యం ఇందిరా గాంధీ వర్ధంతి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి అందించిన సేవలను గురించి చర్చించుకుని వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మంత్రి గణేష్, మాసాని శ్రీనివాస్ రెడ్డి, కొత్తకొండ భాస్కర్, హన్మండ్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు యూనుస్, భాను గౌడ్, బండి సాయిలు, రమేష్, దుబాయ్ సాయిలు, ఆనంద్, రవి పటేల్, శేఖర్, హన్మండ్లు, అంబర్ సింగ్, లాయక్, అషు,సతీష్ గుమ్మడి, ఆసిఫ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








