V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను మరియు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న దుష్టశక్తుల వైఖరిని నిరసిస్తూ గురువారం రోజు నసురుల్లాబాద్ మండల వ్యాప్తంగా బంద్ చేపట్టాలని హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు అందరూ కలిసి సమైక్యంగా పిలుపునిచ్చారు. బిజెపి పార్టీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు, మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో గల హిందువులు పార్టీలకు అతీతంగా ఎవరి గ్రామంలో వారు స్వచ్ఛందంగా.. శాంతియుతంగా బంద్ పాటించాలని అన్నారు. అదేవిధంగా బుధవారం రోజు సాయంత్రం ప్రజల వద్దకు మరియు వ్యాపార సముదాయాల దగ్గరికి వెళ్లి గురువారం రోజు బంద్ పాటించి సహకరించే విధంగా కార్యకర్తలందరు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. బంద్ కు వ్యాపారస్తులు, హిందూ బంధువులు అందరు సహకరించాలని కోరారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బొమ్మన్ దేవ్ పల్లి ఎక్స్ రోడ్ నుండి నసురుల్లాబాద్ రామాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల హిందూ బంధువులు, సంఘాలు పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








