V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో మంగళవారం రోజు పట్లోళ్ల మోహన్ రెడ్డి (ఎన్నారై), రోటరీ క్లబ్ ఖమ్మం వారి సహకారంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల వికలాంగులకు ట్రై సైకిల్ లు మరియు కృత్రిమ కాళ్లు అమర్చడం కొరకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి గల అంగవైకల్యం పరిమాణాన్ని బట్టి ఎంపిక ప్రక్రియ చేపట్టామని సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ పట్లోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 300 మందికి పైగా వికలాంగులకు వారి పాదాల కొరకు కొలతలను తీసుకున్నామని.. వారందరికీ మరో నెల రోజుల్లో కృత్రిమ కాళ్ళను మరియు ట్రై సైకిళ్లను అందజేస్తామని ఆయన తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడం వలన చాలామంది వికలాంగులు కృత్రిమ కాళ్లను మరియు ట్రై సైకిళ్లను కొనుగోలు చేసుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో పట్లోళ్ల మోహన్ రెడ్డి వికలాంగుల సమస్యల పట్ల గొప్ప మనసుతో ఆలోచించి.. ఇంత మంచి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరూ ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా ట్రస్టు మెంబర్ విజయ్ కుమార్ (నందు) రెడ్డి, పోతారెడ్డి, బాల్ రాజ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








