-భవన నిర్మాణానికి యదేచ్చగా కొండ్లు వేస్తూ పనులు నిర్వహిస్తున్న వైనం
-గుత్తేదార్ నిర్వాకానికి విస్తు పోతున్న ప్రజలు
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం పనులు సాగుతున్నాయి. అయితే గుత్తేదార్ భవన నిర్మాణానికి అవసరమయ్యే విద్యుత్తును గ్రామపంచాయతీ విద్యుత్తును చోరీ చేస్తున్నట్లు పైన చిత్రాలు కనబడుతున్నాయి. భవన నిర్మాణానికి సొంత విద్యుత్తును ఉపయోగించాల్సి ఉండగా గ్రామపంచాయతీ విద్యుత్ ను కొండీలు వేస్తూ యదేచ్ఛగా వినియోగిస్తుండటంతో చూపరులు విస్తు పోయారు. రూపాయలు ఒక కోటి 43 లక్షలతో భవనం నిర్మాణం చేపడుతూ చిన్న చిన్న విషయాలకు గుత్తేదారు కక్కుర్తి పడడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. పేరుకు కాంట్రాక్టర్ గా పనులు చేస్తూనే ప్రభుత్వ విద్యుత్తును ఇలా తన సొంత అవసరాలకు చోరీ చేస్తూ వినియోగించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భవన నిర్మాణానికి అవసరమగు నీటిని సైతం సమీకృత భవనం వద్ద ఉన్న బోరును ఉపయోగించి పనులు చేస్తుండడంతో సంబంధిత అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్ భవన నిర్మాణానికి శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బలవంతం చేయడంతోనే పనులు నిర్వహిస్తున్నామని అందులో తమకు ఎటువంటి లాభాలు లేవంటూ పలువురితో చర్చించినట్లు మండల నాయకులు పుకార్లు చేస్తున్నారు. ఎటువంటి లాభాలు లేకుండా ఒక్క కోటి 43 లక్షలతో భవనం నిర్మించడం ఎలా సాధ్యమవుతుందని తోటి కాంట్రాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుత్తేదారు వివిధ రకాలుగా విద్యుత్తు, మంచినీటి సదుపాయాలు ప్రభుత్వానివి వాడకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. సామాన్య ప్రజలను పట్టిపీడించే విద్యుత్ శాఖ అధికారులు పట్టపగలు కాంట్రాక్టర్ కొండ్లు వేసి దర్జాగా పనులు నిర్వహిస్తుంటే విద్యుత్ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా వారు గుత్తేదారును ప్రోత్సహించినట్లే అవుతుందని చర్చించుకుంటున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








